‘అనకాపల్లి’ ట్రైలర్ ను విడుదల చేసిన టాలీవుడ్ థండర్స్ టీం
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ థండర్స్ టీం కలిసి వేలాది మంది సమక్షంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. హీరో శ్రీకాంత్, తమన్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు తదితరులంతా కూడా ట్రైలర్‌ను విడుదల చేసి అభినందనలు తెలియజేశారు.
ఈ ట్రైలర్లో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కొత్తగా ఉండటం, తారక్ పొన్నప్ప విలనిజం డిఫరెంట్‌గా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉండటంతో ఓ కొత్త ఫీల్ కలుగుతుంది. ఈ ట్రైలర్లో మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా త్రినాథరావు నక్కిన, ఇంద్రజ కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎమోషన్ ఉందనిపిస్తోంది. యూత్, మాస్ ఆడియెన్స్‌కి నచ్చే లవ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను టార్గెట్ చేయబోతోన్నామని ఈ ట్రైలర్ కట్‌తో చెప్పకనే చెప్పారు.
ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని ఆగస్ట్ 7న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.








