రవితేజ ఇరుముడి సినిమా రిలీజ్‌పై క్లారిటీ!
మాస్ మహారాజా రవితేజ(raviteja) హీరోగా రూపొందుతున్న ఇరుముడి(Irumudi) సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకు చిత్రబృందం పూర్తి స్థాయిలో తెరదించింది. ముందుగా అనౌన్స్ చేసిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇస్తూ, ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయగా, సినిమా రిలీజ్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాజా పోస్టర్లో రవితేజతో పాటు చిన్నారి నక్షత్ర(Nakshatra) కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరూ కలిసి సరదాగా పేకాట ఆడుతున్న విజువల్ సినిమా కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి- కూతురు భావోద్వేగాల చుట్టూ తిరిగే కథను కూడా బలంగా చూపించబోతుందనే అంచనాలను పెంచుతోంది. డైరెక్టర్ శివ నిర్వాణ(Siva Nirvana) తనకు ప్రత్యేకమైన భావోద్వేగ కథనాన్ని ఈ సినిమాలోనూ కొనసాగించినట్లు ఈ ప్రమోషనల్ పోస్టర్ ద్వారా తెలియచేస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఇరుముడి కట్టు(Irumudi kattu) సాంగ్ మంచి ఆదరణ పొందడం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్, సాంగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ వంటి వరుస అప్డేట్స్ను అందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) మ్యూజిక్ అందిస్తున్నారు.








