మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు ఫ్రిజ్‌లో పెట్టినా వాడిపోతున్నాయా? అయితే ఈ లేటెస్ట్ స్మార్ట్ చిట్కాలు మీ కోసమే!
కూరగాయలను కడిగిన తర్వాత తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. తేమ ఉంటే బ్యాక్టీరియా చేరి త్వరగా కుళ్ళిపోతాయి.
కడిగిన తర్వాత ఆరబెట్టడం
తోటకూర, పాలకూర లాంటి ఆకుకూరలను పేపర్ టవల్‌లో చుట్టి ఎయిర్ టైట్ బాక్స్‌లో పెడితే వారం పైగా తాజాగా ఉంటాయి.
ఆకుకూరల నిల్వ
పండ్లు విడుదల చేసే ఇథిలిన్ గ్యాస్ వల్ల పక్కన ఉన్న కూరగాయలు త్వరగా పాడవుతాయి. కాబట్టి రెండింటినీ విడిగా ఉంచండి.
పండ్లు, కూరగాయలు విడిగా
గాలి ఆడ ని ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు ఉంచితే తేమ పేరుకుపోతుంది. నెట్ బ్యాగులు లేదా పేపర్ బ్యాగులు వాడండి.
ప్లాస్టిక్ కవర్లు వద్దు
నిమ్మకాయలు ఎక్కువ రోజులు గట్టిపడకుండా ఉండాలంటే, వాటిని ఒక గాజు సీసాలో నీళ్లు పోసి అందులో ముంచి ఫ్రిజ్‌లో పెట్టండి.
నిమ్మకాయల తాజాదనం
క్యారెట్లకు పైన ఉండే ఆకులను కట్ చేసి, జిప్ లాక్ బ్యాగ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు గట్టిగా, తాజాగా ఉంటాయి.
క్యారెట్, బీన్స్ నిల్వ
ఫ్రిజ్ వెజిటబుల్ బాక్స్‌లో ఒక చిన్న పొడి స్పాంజ్ ఉంచితే, అది అదనపు తేమను పీల్చుకుని కూరగాయలను కాపాడుతుంది.
వెజిటబుల్ బాక్స్‌లో స్పాంజ్ ట్రిక్
వంట కోసం కూరగాయలను ముందే కట్ చేస్తే, వాటిని గాలి చొరబడని డబ్బాల్లో (Airtight Containers) మాత్రమే నిల్వ చేయాలి.
కట్ చేసిన ముక్కలు
ఫ్రిజ్ ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ 4°C నుండి 6°C మధ్య ఉంచడం ద్వారా బ్యాక్టీరియా చేరకుండా కూరగాయలు తాజాగా ఉంటాయి.