అమెరికా గడ్డపై తెలుగు సాహితీ, సంగీతాల పండుగ.. టీటీఏ మెగా కన్వెన్షన్లో ‘సాహిత్య సంగీత వేదిక’ త్వరలో
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) ఆధ్వర్యంలో జూలై 17 నుండి 19, 2026 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్, షార్లెట్, NC వేదికగా ‘టీటీఏ మెగా కన్వెన్షన్’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్లో భాగంగా ‘సౌవెనీర్ అండ్ లిటరరీ కమిటీ’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సంగీత వేదిక’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ వేదికపై పలు ఆసక్తికరమైన కార్యక్రమాలు , ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఉండనున్నాయి:
సంగీత దశావధానం: గాన కళా తపస్వి, స్వర సామ్రాట్ డాక్టర్ శరత్ చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
గేయకర్తలకు గీతాంజలి: ప్రముఖ సినీ గీత రచయిత, గాయకులు , సంగీత దర్శకులు కాసర్ల శ్యామ్ గారి వ్యాఖ్యానంతో, అమెరికా కోకిల శారద ఆకునూరి, ధీరజ్ గాత్రంతో గేయకర్తలకు గీతాంజలి కార్యక్రమం నిర్వహిస్తారు.
సాహిత్యోపన్యాసము: ప్రముఖ కార్డియాలజిస్ట్ , సాహిత్యవేత్త డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి సాహిత్యోపన్యాసం చేస్తారు.
జానపద, సంప్రదాయ పేరడీ పాటలు: అంతర్జాతీయంగా సుపరిచితులైన జానపద గాయని, వెర్టైల్ సింగర్ డాక్టర్ అరుణా సుబ్బారావు గారు జానపద , పేరడీ పాటలతో అలరించనున్నారు.
ఈ ‘సాహిత్య సంగీత వేదిక’ను విజయవంతం చేయడానికి డైరెక్టర్ శ్రీనివాస్ గుడూరు, చైర్ (లిటరరీ) సుధాకర్ ఉప్పల , కో-చైర్స్ సునీల్ రెడ్డి గద్దం, సంపత్ కొండ, రాజి బుర్ర, డా. వాణి గద్దం, శృతి అకావరంతో కూడిన సౌవెనీర్ అండ్ లిటరరీ కమిటీ కృషి చేస్తోంది. ఈ మెగా కన్వెన్షన్ వివరాల కోసం , మరిన్ని కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి ttaconvention.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.
మరిన్ని ఫ్లయర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








