ఆగస్టు 2న ఆటా అష్టావధాన సాహిత్య వేడుక
ATA: అమెరికన్ తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో జరగనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌లో భాగంగా ‘సాహిత్య విభాగం’ ప్రత్యేక అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకలు జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్, మేరీల్యాండ్‌లో జరగనున్నాయి.
వివరాలు..
ఈ అష్టావధాన కార్యక్రమం ఆగస్టు 2, 2026, ఆదివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది. శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ఈ అష్టావధానాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ అవధాన కవి డాక్టర్ నరాల రామారెడ్డి హాజరుకానున్నారు. ఈ సాహిత్య కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ataliterary@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చు.








