స్క్వాష్ ఆస్ట్రేలియా 2027-2029 టీములో కనిష్క్ దొడ్డంరెడ్డి
రాబోయే మూడేళ్ల కాలంలో (2027-2029) వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యంత ప్రతిభావంతులైన యువ క్రీడాకారులతో కూడిన ‘నేషనల్ జూనియర్ టాలెంట్ స్క్వాడ’ను స్క్వాష్ ఆస్ట్రేలియా ప్రకటించింది. స్క్వాష్ ఆస్ట్రేలియా నేషనల్ పాత్‌వేస్ కోచ్ జెన్నీ డన్కాల్ఫ్ నేతృత్వంలో ఈ స్క్వాడ్ పనిచేస్తుంది. ఈమె ఆటగాళ్లకు, వారి తల్లిదండ్రులకు మరియు వ్యక్తిగత కోచ్‌లకు అవసరమైన తగిన మార్గదర్శకత్వాన్ని, కోచింగ్ సపోర్ట్‌ను అందిస్తారు. ఈ స్వ్కాడ్ లో మన తెలుగువాడు ఎంపికకావడం విశేషం.

ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలుగువాడు కనిష్క్ దొడ్డం రెడ్డి (ఎసఎ-ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్) ఇందులో ఎంపికయ్యాడు. కనిష్క్ ఎంపిక పట్ల పలువురు తెలుగువాళ్లు అతనికి అభినందనలు తెలియజేశారు. కాగా ఎంపికైన అథ్లెట్లకు స్క్వాష్ ఆస్ట్రేలియా మరియు ఆస్ట్రేలియన్ హై పెర్ఫార్మెన్స్ స్పోర్ట్ సిస్టమ్ ద్వారా పలు రకాల సదుపాయాలు కల్పిస్తారు. నేషనల్ మరియు స్టేట్ పాత్వే క్యాంప్‌లలో వ్యక్తిగత కోచింగ్ సెషన్స్. ‘ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ ప్లాన’ లో భాగంగా AజీST-గోల్డ్ ఈవెంట్లలో రెండు వయో విభాగాలలో ఆడే అవకాశం. అంతర్జాతీయ టూర్ గ్రూపులలో పాల్గొనేందుకు ప్రాధాన్యత. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ద్వారా వెల్బీయింగ్ అండ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్‌ల యాక్సెస్ వంటి సదుపాయాలు లభిస్తాయి.








