ఆగస్టు 7 & 8 న హ్యూస్టన్‌లో టీసీఏ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పురస్కరించుకుని, ‘TCA50 గోల్డెన్ జూబ్లీ వేడుకల’ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వారసత్వం, సంస్కృతి , కమ్యూనిటీ స్ఫూర్తితో కూడిన ఈ చారిత్రాత్మక వేడుకలు ఆగస్టు 7 , 8, 2026 తేదీలలో హ్యూస్టన్, టెక్సాస్‌లో జరగనున్నాయి.
వివరాలు..
ఈ వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు , సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని, చరిత్రలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం , రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.








