హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ సంబరాలు
TCA: అమెరికాలోని ప్రముఖ ప్రవాస తెలుగు సంస్థ “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” (Telugu Cultural Association – TCA) సరికొత్త మైలురాయిని అధిగమించింది. తెలుగు భాష, సంస్కృతి, సమాజ సేవ అనే నినాదాలతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ, విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవ) వేడుకలను (1976-2026) ఘనంగా జరుపుకుంటోంది.
యాభై ఏళ్ల ప్రయాణం..
ఐదు దశాబ్దాలుగా అమెరికాలో తెలుగు సంస్కృతిని కాపాడుతూ, భావితరాలకు మన వారసత్వాన్ని అందిస్తూ, తెలుగు కుటుంబాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో TCA కీలక పాత్ర పోషించింది. ఐక్యత, సంస్కృతి , సేవాభావంతో కూడిన ఈ యాభై ఏళ్ల ప్రయాణం హ్యూస్టన్ కమ్యూనిటీకి ఒక గర్వకారణం.
“మన భాష – మన సంస్కృతి – మన సంప్రదాయం” అనే మూలస్తంభాలతో, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ , తెలుగు కుటుంబాలకు సంస్థ ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు , శుభాకాంక్షలు తెలియజేశారు.








