TAGCA ఆధ్వర్యంలో సక్సెస్ గా ముగిసిన ‘‘Health Fair’’
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లట్ ఏరియా (TAGCA) ఆధ్వర్యంలో హెల్త్ ఫెయిర్ 2026 ఘనంగా ముగిసింది. అక్టోబర్ 18, 31 వ తేదీల్లో ఈ ఆరోగ్య శిబిరం జరిగింది. అక్టోబర్ 18 న PINEVILLE DENTAL STUDIO లో రక్తదాన దినోత్సవం జరిగింది. డా. శ్రీలత చలసాని నేతృత్వంలో ఇది జరిగింది.

ఇవి కూడా చదవండి
ఇక.. అక్టోబర్ 31 వ తేదీన జరిగిన ఆరోగ్య శిబిరం శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిర్ లో జరిగింది. ఈ వైద్య శిబిరంలో డా. శ్రీలత చలసాని, డా. నిశ్చల్ నేత, డా. శ్రీనివాస్ కోయ, డా. శోభ జయరాం, డా. కృష్ణ జొన్నలగడ్డ వైద్యులు తగిన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకూ ఈ వైద్య శిబిరం కొనసాగింది.

ఈ ఆరోగ్య శిబిరం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఛార్లట్ ఏరియా ప్రకటించింది. సమాజానికి సేవ చేయాలన్న తమ తపనను ఆచరణలోకి తెచ్చి, సేవలందించిన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు ప్రకటించారు. అలాగే ఎప్పటికప్పుడు సేవలందించి, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందుకు సహకరించిన వాలెంటీర్లకు కూడా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. రక్తదాన దినోత్సవం మరియు ఆరోగ్య సంప్రదింపుల శిబిరాన్ని విజయవంతం చేసిన పాల్గొన్న వారందరికీ మరియు వాలంటీర్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రకటించారు.








