భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో బౌద్ధం విస్తరణపై సదస్సు
న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ‘‘ప్రాచీన కాలం నుంచి నేటి వరకు బౌద్ధం’’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రముఖ మేధావులు, కళాకారులు, బౌద్ధ మేధావులు హాజరయ్యారు. భారతదేశం నుండి బౌద్ధమతం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో ఇందులో కూలంకషంగా చర్చించారు.
రాయబారి వినయ్ క్వాత్రా, భారతదేశం తన బౌద్ధ వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఇటీవల చేపట్టిన ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, బౌద్ధ అధ్యయనాలలో భారత్-అమెరికా మధ్య మరింత సహకారానికి గల అవకాశాలను వివరించారు.

గ్యేత్రుల్ జిగ్మే రిన్పోచే మాట్లాడుతూ, బుద్ధుని బోధనలు మనస్సులో అంతర్గత పరివర్తనపై దృష్టి సారిస్తాయని, దయ మరియు కరుణ అనే సందేశం కలిగి ఉండటం వల్లే ఈ బోధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగాయని నొక్కి చెప్పారు.
యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సోనమ్ కచ్రు మరియు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ సీనియర్ క్యూరేటర్ అయిన మిస్టర్ జాన్ గై, సంస్కృతం మరియు బౌద్ధ కళ ద్వారా ఆసియా అంతటా బౌద్ధమతం వ్యాప్తి చెందడంపై ప్రజెంటేషన్ ఇచ్చారు; కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ కిట్టే మరియు ప్రొఫెసర్ పాల్ హ్యాకెట్, బౌద్ధమత అధ్యయనం మరియు ప్రచారాన్ని ఏ విధంగా కృత్రిమ మేధస్సు (AI) మారుస్తోందనే దానిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు; మరియు కళాకారులు ఓరి కారినో, మెహో స్కాల్స్కీ & యెషి దోర్జీ, బౌద్ధ భావనల నుండి ప్రేరణ పొందిన తమ ‘మెరిట్ జనరేటర్’ అనే ఆర్ట్ ఇన్స్టాలేషన్ మరియు డిజిటల్ ‘థాంకా ఆర్ట్’ను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసినందుకు గాను, కాన్సుల్ జనరల్ బినయ్ ఎస్. ప్రధాన్ హాజరైనవారికి, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు.








