ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిపోతున్న శ్రీలీల
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్, గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో తక్కువ టైంలోనే అపారమైన క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల(Sree Leela) సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. లీల ఏ కొత్త పోస్ట్ షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవ్వడం సహజమే. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోలకు కూడా నెటిజన్ల నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫోటోల్లో శ్రీలీల ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఈ శారీలో శ్రీలీల కనిపించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోగా, ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.








