RC17పై తబిత పోస్ట్‌తో మెగా ఫ్యాన్స్‌లో కొత్త జోష్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం(rangasthalam) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి చేతులు కలుపుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పుష్ప(pushpa) సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సుకుమార్.. ఈసారి రామ్ చరణ్‌ను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అంతేకాకుండా ఈ సినిమా ఓపెనింగ్ సీన్ గురించి దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) సైతం ఆసక్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలు ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను పెంచాయి.
ఇదిలా ఉంటే, తాజాగా సుకుమార్ భార్య తబిత సుకుమార్(thabitha sukumar) చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఎంతగా కష్టపడ్డారో, కథను రెడీ చేయడానికి ఎంత సమయాన్ని వెచ్చించారో తనకు తెలుసని ఆమె పేర్కొన్నారు. ఆయనలోని అభిరుచి, పట్టుదల, రచన కోసం చేసిన నిరంతర శ్రమ ఇప్పుడు ఒక రూపం దాల్చబోతుండటం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వీడియోతో కూడిన పోస్ట్‌లో వెల్లడించారు.
తబిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా సినిమా కోసం సుకుమార్ పడిన శ్రమ గురించి ఆమె చేసిన కామెంట్స్ కథపై మరిన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ కు తెరలేపాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రారంభోత్సవం జరగడంతో నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, సుకుమార్ మరోసారి రంగస్థలం మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.








