డ్రాగన్ కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొల్పుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్(prasanth neel) తెరకెక్కిస్తున్న డ్రాగన్(dragon) సినిమా ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్(ntr) హీరోగా నటిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సినిమా మ్యూజిక్ విషయంలో ప్రశాంత్ నీల్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ మ్యూజిక్ టీమ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా కోసం మొదట సాంగ్స్ ను కంపోజ్ చేసే బాధ్యతలను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(anirudh ravichander)కు అప్పగించాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్(sasvath sachdev) వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరు సంగీత దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించగా, ఇప్పుడు ఆ బాధ్యతలను శాశ్వత్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి రవి బస్రూర్(ravi basrur) నేపథ్య సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ధురంధర్ ఫ్రాంచైజీలో శాశ్వత్ సచ్దేవ్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్ పై స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన టాలెంట్ ను గుర్తించిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ల మార్పుపై చిత్రబృందం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఒకవైపు ప్రశాంత్ నీల్ మేకింగ్, మరోవైపు రవి బస్రూర్ నేపథ్య సంగీతం, శాశ్వత్ స్వరాలు కలిస్తే డ్రాగన్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.








