ATA ఆధ్వర్యంలో నవంబర్ 14 న దసరా- దీపావళి వేడుకలు
ఆల్బనీ తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో దసరా- దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. నవంబర్ 14 న మధ్యాహ్నం 3:00 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు ప్రకటించారు. 450 ALBANY SHANKER RD, ALBANY, NY 12211 వేదికగా జరగనున్నాయి.
ఈ వేడుకలకు హాజరయ్యే సెలబ్రెటీలు వీరే..
అరియానా గ్లోరీ (స్పెషల్ గెస్ట్)
హర్షిత యార్లగడ్డ (INDIAN IDOL FAME)
4legs కిరణ్ (specialacts)
మరోవైపు నవంబర్ 12 వరకు అయితే.. ఆన్ లైన్ ప్రైజ్ early bird member కి 12 డాలర్లు, early bird non member అయితే 15 డాలర్లుగా నిర్ణయించారు. పిల్లలకు పూర్తి ఉచితంగా వుంటుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ కిశోర్ కుప్పిరెడ్డి సారథ్యంలో జరుగుతుండగా, ప్రదీప్ ముచెలి, నరేశ్ సామ, శ్రీకాంత్ బొమ్మ, మహేష్ అవధూత, సరిత పోల, కరుణ దాసరి, కిషన్ జమ్ముల, రవి చిర్రా, మనోహర్ గుడికందుల, చైతన్య వేములపల్లి, తనోజ్ నూతక్కి, వంశీ నీల సహకరిస్తున్నారు.








