ఇరుముడి తర్వాత మరో బ్లాక్బస్టర్.. దుల్కర్ సినిమాపై జి.వి. జోస్యం!
దుల్కర్ సల్మాన్(dulquer salman) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఆకాశంలో ఒక తార(Aakasam lo oka tara)పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. తాజాగా నేషనల్ అవార్డు విన్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్(GV Prakash kumar) ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆకాశంలో ఒక తారను ఈ ఏడాది సినిమాగా అభివర్ణించడంతో పాటు, ఇరుముడి వంటి జనరేషనల్ బ్లాక్బస్టర్ తర్వాత తన నెక్స్ట్ భారీ తెలుగు సినిమా ఇదేనని పేర్కొన్నారు. గతంలో ఇరుముడి సినిమా విషయంలో ఆయన వ్యక్తం చేసిన అంచనాలు నిజం కావడంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కృష్ణ అనే సాధారణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ లో ఆయన లుక్, యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవాలనే మానవ ఆకాంక్షలు, పట్టుదలతో కలలను సాకారం చేసుకునే స్ఫూర్తిదాయకమైన కథాంశంతో డైరెక్టర్ పవన్ సాధినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి(satvika veeravalli) హీరోయిన్ గా పరిచయమవుతుండగా శృతి హాసన్(shruthi hasan), రుహానీ శర్మ(ruhani sharma) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గీతా ఆర్ట్స్(geetha arts), స్వప్న సినిమా(swapna cinema) సమర్పణలో సందీప్ గున్నం(sandeep gunnam), రమ్య గున్నం(ramya gunnam) ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై పెరుగుతున్న అంచనాలకు జి.వి. ప్రకాష్ కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, ఆసక్తికరమైన కథాంశం, దర్శకుడి ప్రతిభతో ఆకాశంలో ఒక తార ఆడియన్స్ కు ఓ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.








