పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన RC17
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(sukumar) కలయికలో తెరకెక్కనున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ #RC17 ఎట్టకేలకు పట్టాలెక్కింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) చీఫ్ గెస్టుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్, సుకుమార్‌లపై చిరంజీవి క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన రంగస్థలం(rangasthalam) ఎలాంటి సెన్సేషనల్ సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా తనలోని మరో యాంగిల్ ను ఆవిష్కరించడమే కాకుండా, ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ చేతులు కలపడంతో #RC17పై అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సుకుమార్ తనదైన కథనం, విభిన్నమైన మేకింగ్‌తో ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించనుంది. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్, ఇతర వివరాలను మేకర్స్ దశలవారీగా వెల్లడించే అవకాశం ఉంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.








