బ్లాక్ బస్టర్ ఛాన్స్ కొట్టేసిన హరీష్ శంకర్
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), డైరెక్టర్ హరీష్ శంకర్(harish shankarv కాంబినేషన్లో ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. అయితే ఇది సినిమా కోసం కాదు.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(netfilx) నిర్వహిస్తున్న మెగావర్స్(megaverse) టాక్ షో కోసం కావడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన స్పెషల్ ప్రమోషనల్ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనుండగా, దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది.
చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని, ఆయనపై తనకున్న ప్రత్యేకమైన అభిరుచిని హరీష్ శంకర్ పలు సందర్భాల్లో చాటుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను అభిమానించే హరీష్.. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది. మెగావర్స్ టాక్ షో ప్రమోను తనదైన స్టైల్లో, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రమోషనల్ వీడియోను ఈ నెలాఖరులో రిలీజ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి వంటి స్టార్ హీరోని మెగావర్స్ ప్రోమోలో భాగం చేయడం ద్వారా ఈ టాక్ షోపై మరింత ఆసక్తిని పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ కనిపించనున్న ఈ స్పెషల్ ప్రోమో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.








