TTA మెగా కన్వెన్షన్ 2026 కన్వీనర్ గా ప్రవీణ చింత… కీలక నిర్ణయం తీసుకున్న TTA బోర్డు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) షార్లెట్, నార్త్ కరోలినాలో విజయవంతంగా తన త్రైమాసిక బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం TTA వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, AC చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, AC కో-చైర్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల, AC సభ్యులు భరత్ రెడ్డి మాదాడి మరియు శ్రీని అనుగు, అలాగే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచర్లకుంట్ల, మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యుల నాయకత్వంలో జరిగింది.
ఈ సందర్బంగా సమావేశంలో రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. TTA మెగా కన్వెన్షన్ 2026 కోసం కన్వెన్షన్ కన్వీనర్ ప్రకటన.2026 జూలై 17 నుండి 19 వరకు జరగనున్న TTA మెగా కన్వెన్షన్ 2026కు, కన్వెన్షన్ కన్వీనర్‌గా ప్రవీణ్ చింతను కమిటీ ప్రకటించింది.

సంస్థ చరిత్రలో ఒక అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా, షార్లెట్ (నార్త్ కరోలినా)లో జరిగిన TTA కన్వెన్షన్ ప్రారంభ సమావేశంలో, TTA సంస్థ ఏకంగా 1.11 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. TTA కన్వెన్షన్ ప్రారంభ కార్యక్రమాల్లో ఇలాంటి విజయం సాధించడం ఇదే మొదటిసారి; ఇది 2026లో జరగబోయే ఈవెంట్ విజయానికి బలమైన పునాదిని వేసిందని బోర్డు అభిప్రాయపడింది.
అలాగే 2025 డిసెంబర్ 25న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనున్న 10వ వార్షికోత్సవ వేడుకలు, అలాగే డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 22 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘TTA సేవా దినోత్సవాలు’ (TTA Seva Days) వంటి కీలక కార్యక్రమాలపై బోర్డు లోతైన చర్చలు జరిపింది.
అలాగే TTA కుటుంబంలోకి మయామి మరియు అలబామా అనే రెండు కొత్త చాప్టర్లను బోర్డు ప్రకటించింది. దీని ద్వారా TTA పరిధి విస్తరించిందని బోర్డు గర్వంగా ప్రకటించుకుంది. ఈ త్రైమాసికంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు ప్రాంతీయ ఉపాధ్యక్షులు దిలీప్ సయసాని, ప్రదీప్ కయిదాపురం, రాజు పార్థిరెడ్డిని సత్కరించారు. అనుకున్న లక్ష్యం కంటే సంస్థ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో వీరిని అభినందించారు.

అలాగే TTA బోర్డు అధికారిక TTA మెగా కన్వెన్షన్ లోగోను, కొత్త మెగా కన్వెన్షన్ వెబ్ సైట్ ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అలాగే TTA బోర్డ్ ప్రత్యేక TTA సేవా డేస్ లోగోతో పాటు TTA 10వ వార్షికోత్సవ లోగోను కూడా ప్రకటించింది. ఇప్పటికే TTA సభ్యుల సంఖ్య పెరిగిందని, సమాజ భాగస్వామ్యం కూడా పెరిగిందని, రాబోయే త్రైమాసికంలో మరింత అనుకున్న లక్ష్యాల్లో వృద్ధి సాధిస్తామని బోర్డు ధీమా వ్యక్తం చేసింది. అధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు, AC, EC మరియు BOD సభ్యుల అద్భుతమైన సమన్వయం మరియు అంకితభావానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.








