ఫిలడెల్ఫియాలో రాజస్థానీ మండల్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ఫిలడెల్ఫియాలో రాజస్థానీ మండల్, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ సంయుక్తంగా దీపావళి వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ కాన్సుల్ జనరల్ విశాల్ హర్ష్ హాజరయ్యారు.PARAM దీపావళి స్నేహ్ మిలన్ 2026, పేరుతో జరిగిన ఈ దీపావళి వేడుకలు పెన్సిల్వేనియాలోని మాంట్గోమరీవిల్లేలో జరిగాయి. ఈ వేడుకలకు రాజస్థానీ కుటుంబాలు, స్నేహితులు, అతిథులు హాజరయ్యారు. ఎంతో ఉత్సాహంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు.

న్యూయార్క్‌లోని భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ శ్రీ విశాల్ హర్ష్, 93.3 WMMR వారి ప్రెస్టన్ & స్టీవ్ షోకు చెందిన స్టీవ్ మోరిసన్, మరియు మాక్స్ ఫండ్‌కు చెందిన క్లేర్ మోరిసన్ అతిథులుగా విచ్చేశారు. క్యాంప్ అవుట్ ఫర్ హంగర్ మరియు జంతు సంక్షేమ కార్యక్రమాలతో సహా సమాజ సేవకు వారు చేసిన కృషి, సేవా యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించినట్లయ్యింది.
ఇలా అందరూ ఒకచోట చేరి, దీపావళి సంబరాలు జరుపుకున్నందుకు ఆనందంగా వుందని ప్రకటించారు. రాజస్థానీ మండల్ నిజమైన స్ఫూర్తిని, ఐక్యతను, స్నేహాన్ని, తమ సాంస్కృతిక మూలాలను చూసి చాలా గర్వపడ్డామని, తామంతా ఒకే కుటుంబ అన్న భావన తమలో మరింత బలపడిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు.








