ఏపీలో మూడు చోట్ల రీపోలింగ్: ఎస్ఈసీ
చెదురుమదురు ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. జిల్లా కలెక్టర్లు (District Collectors), ఎస్పీల (SPs) నివేదిక ఆధారంగా మూడు చోట్ల (నాలుగు పోలింగ్ కేంద్రాల్లో) రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (Anil Chandra Punetha) ఆదేశించారు. పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్ల మున్సిపాలిటీ పరిధి 23 వార్డులోని రెండు పోలింగ్ బూత్‌ల్లో ప్రకాశం జిల్లా మాచర్ల మున్సిపాలిటీ పరిధి 23 వార్డులోని రెండు పోలింగ్ బూత్‌ల్లో, ప్రకాశం జిల్లా చీమకుమర్తిలోని 14 వార్డులోని ఒక బూత్‌లో, అనంతపురం నగరపాలక సంస్థ 30వ డివిజన్లో పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనాలుగు కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎస్ ఈసీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.








