బెల్ట్ షాపుల నిర్మూలనలో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
బెల్ట్‌షాపుల నిర్మూలనను మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో విఫలమైందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) విమర్శించారు. నల్గొండ జిల్లా గట్టుప్పల మండల (Gattupala Mandal) కేంద్రంలో బీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు పైసలు లేనిది పనిచేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సరైన ప్రణాళికలు రూపొందించలేదని విమర్శించారు. అంతకుముందు చండూరు మండలంలో గొలుసుకట్టు దుకాణాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారని స్థానిక ఎస్సైపై ఎమ్మెల్యే ఫోన్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.








