పులివెందులలో ఓటు వేయని వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పులివెందుల ( Pulivendula)లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు (Vote) వేయకుండానే వెనుదిరిగారు. రీ పోలింగ్ (Re-polling) పెడితేనే మళ్లీ వచ్చి ఓటు వేస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలను చూస్తే సంస్కరణలు ఎంత అవసరమో తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎస్ ఈసీ ఎవరి చేతుల్లో ఉన్నారో అందరికీ తెలుసని చెప్పారు. అంతకు ముందు పులివెందులలోని ఆర్వో కార్యాలయం (RO Office) వద్ద బైఠాయించి జగన్ నిరసన తెలిపారు. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదని ఆరోపించారు. అప్పటికే ఫిర్యాదు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఏజెంట్లు కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన తెలుపుతుండగా జగన్ కూడా వారితోపాటు కింద కూర్చొని నిరసన తెలిపారు. జగన్ వద్దకే వచ్చిన ఆర్వోకు వినతిపత్రం అందించారు.








