పులివెందులలో వైఎస్ కుటుంబ హవా తుడిచి పెట్టుకుపోతుంది :వర్ల రామయ్య
పులివెందుల (Pulivendula)లో మాజీ సీఎం జగన్ కుటుంబ హవా మున్సిపల్ ఎన్నికలతో తుడిచిపెట్టుకుపో తుందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పార్టీ నేతలు విజయ్‌కుమార్(Vijay Kumar), బుచ్చిరాంప్రసాద్ (Buchiram Prasad)తో కలిసి విజయవాడలో ఎస్ఈసీ ( SEC)ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులలైనా దక్కించుకుందామని జగన్ తాపత్రయపడుతున్నారు. ఆయన డ్రామాలు అందరూ గమనించాలి. జగన్(Jagan) హెలికాప్టర్‌ను ఎవరూ ఆపలేదు. హెలికాప్టర్‌తో ఆయన ఎందుకు గాల్లో చక్కర్లు కొట్టారు? మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు ఎలా జరుగుతున్నాయని గాలిలో నుంచి చూశారు అని మండిపడ్డారు.








