సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి
ఇటీవలె నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి.
చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రస్ట్బోర్డుకు నియమితులైన వారిని ఆయన అభినందించారు. జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయ పాలకమండలిని నియమించింది. ఈ నెల 11న వీరు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎం కలిసినవారిలో సభ్యులు వినోద్ వెంకటస్వామి(ఎమ్మెల్యే), కొణిదల సురేఖ, సి.విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం.రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్, ఎక్స్ అఫీషియో సభ్యుడు, ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ఈవో భవానీశంకర్ పాల్గొన్నారు.








