8th July 2026

__________

- Saidulu

పూర్వం నాటి చిట్కా... మచ్చలేని మెరిసిపోయే ముఖానికి కుంకుమపువ్వు ఇలా వాడాలి !

ముఖంపై మచ్చలు లేకుండా, సహజంగా మెరిసిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? పూర్వీకుల కాలం నాటి ఓ అద్భుతమైన చిట్కా మీకోసం ఇక్కడ ఉంది.

పూర్వం రాజుల కాలం నుండి రాణులు తమ సౌందర్యం కోసం కుంకుమపువ్వును వాడేవారు. ఇది చర్మానికి సహజ సిద్ధమైన కాంతిని, రంగును ఇస్తుంది.

 కుంకుమపువ్వు రహస్యం

ఈ హోం రెమెడీ కోసం మీకు కావలసినవి: కొన్ని కుంకుమపువ్వు రేకులు, కొద్దిగా పచ్చి పాలు లేదా రోజ్ వాటర్, మరియు కొంచెం తేనె మాత్రమే.

చిట్కాకు కావాల్సినవి

ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల పచ్చి పాలు తీసుకుని, అందులో 3 నుండి 4 కుంకుమపువ్వు రేకులను వేసి ఒక గంట పాటు నాననివ్వాలి.

 ఎలా తయారు చేయాలి? 

పాలు కుంకుమపువ్వు రంగులోకి మారాక, అందులో అర చెంచా తేనె కలపాలి. తేనె చర్మాన్ని సాఫ్ట్‌గా ఉంచి, పొడిబారకుండా కాపాడుతుంది.

తేనెతో పోషణ

ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో ముఖం మరియు మెడ భాగంలో సమానంగా అప్లై చేయాలి.

ముఖానికి పట్టించడం

అప్లై చేసిన తర్వాత వేలి కొనలతో ముఖంపై వృత్తాకారంలో 5 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా పెరుగుతుంది.

మసాజ్ చేయడం

మసాజ్ పూర్తయ్యాక, ఈ ప్యాక్‌ను ముఖంపై 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. అప్పుడే పోషకాలు చర్మంలోకి వెళ్తాయి.

ఎంతసేపు ఉంచాలి?

ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత, గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. సబ్బును మాత్రం అస్సలు వాడకూడదు.

చల్లటి నీటితో వాష్

వారానికి రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే ముఖంపై నల్లటి మచ్చలు తగ్గి, చర్మం చంద్రబింబంలా మెరిసిపోవడం ఖాయం. మీరూ ట్రై చేయండి!