వైఎస్సార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని వైఎస్ఆర్ నివాసంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘవీర్ రెడ్డి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఆయన నిరుపేదలకు అందించిన సేవలు, చూపిన సంక్షేమ బాట ఎప్పటికీ చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన పేదల కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి పథకాలు సమాజంలో విపరీతమైన మార్పులు తెచ్చాయని గుర్తుచేశారు.








