రాయల్ లుక్ లో మెరిసిపోతున్న సోనమ్
బాలీవుడ్ నటి సోనమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలోనే కాకుండా, ఫ్యాషన్ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ సెన్స్ తో ట్రెండ్ సెట్టర్ గా నిలిచే సోనమ్, పెళ్లై ఓ బిడ్డకు తల్లిగా మారాక కూడా తన గ్లామర్, ఫ్యాషన్ సెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. తాజాగా ఆమె ఓ పెళ్లిలో కనిపించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది. పర్పుల్ కేప్ అవుట్‌ఫిట్ లో సోనమ్ రాకుమరిలా రాయల్ లుక్ లో మెరవగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.








