మాతృభూమి, మాతృబాష.. మన విధానం, నినాదం
పాఠశాల వేదికగా మాగులూరి భాను ప్రకాష్ సమన్వయంతో ప్రవాస తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం.
అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న అతిధి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం.. మాట్లాడుతూ ..
వృత్తి ఉపాధి రీత్యా అమెరికా కు వచ్చినా లక్షలాది మంది మాతృభాష తెలుగును మన పిల్లలకు నేర్పిద్దాం, మనదైన చరిత్ర, సంస్కృతీ కాపాడుకుంటూ మన పిల్లలను తీర్చిదిద్దుదాం. అన్ని భాషలూ నేర్చుకుందాం.. కానీ మాతృభాషలో సంభాషించుకుందాం.
భాను మాగులూరి మాట్లాడుతూ తెలుగు మన ఆస్తి, అస్తిత్వం. మన తల్లి దండ్రులకు, మన బిడ్డలకు వారధి తెలుగే. మన జీవితకాలం మాతృబాష సజీవం, సకలం, సమస్తం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు, శంకర్రావు పొన్నం, కృష్ణ మోహన్ జంపాల, సత్యనారాయణరాజు, చంద్రనాధ్ నంబూరు, వెంకట రెడ్డి గోలి, సుబ్బారావు చిట్టెల, రామకృష్ణ రెడ్డి, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటీ, సురేష్, యోగానంద్ వంకిన, నూరిబాబు షేక్, సురేష్ లగిశెట్టి, గణేష్ రెడ్డి బుడిపాటి, రాజా కరణం, రాజేంద్రప్రసాద్ పులిపాటి, ప్రభు బచ్చు తదితరులు పాల్గొన్నారు.









