తానా – శ్రీకాంత్ పోలవరపు కేసులో ఏం జరుగుతోంది ?
తానా ప్రెసిడెంట్, డాక్టర్ నరేన్ కొడాలి దగ్గరనుంచి తానా ప్రతి సభ్యుని వరకు, ఇంకా చెప్పాలంటే లక్షలాది తానా శ్రేయోభిలాషులకు వరకు కూడా ఆలోచింపచేసే ప్రశ్న ఏమిటంటే…. దాదాపు 2 సంవత్సరాల క్రితం తానా నిధుల నుంచి దాదాపు $3.5 మిలియన్ వరకు మళ్లించిన శ్రీకాంత్ పోలవరపు కేసు లో ఏం జరుగుతోంది ? అని. ఈ మధ్యనే ఏదో ఒక సమావేశంలో మాట్లాడుతూ తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి మాట్లాడుతూ తన ముందున్న ముఖ్యమైన కర్తవ్యం శ్రీకాంత్ పోలవరపు మళ్లించిన తానా డబ్బులు వెనక్కి తేవడమే అని స్పష్టం గా చెప్పారు.
ఈ విషయంలో కొంచెం పరిశీలన చేసిన తర్వాత తెలుగు టైమ్స్ తెలిసిన విషయాలు…
9 మే 20 25 తేదీన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఇంక్ (తానా) డల్లాస్ నగరం లో డిస్ట్రిక్ట్ కోర్ట్ అఫ్ నార్తెన్ డిస్ట్రిక్ట్ అఫ్ టెక్సాస్ ( డల్లాస్ డివిజన్ ) లో కేసు ఫైల్ చేశారు/ ఈ కేసులో ముద్దాయిగా శ్రీకాంత్ పోలవరపు, శ్రీమతి సుధా కాట్రగడ్డ, బృహత్ టెక్నాలజీస్ ఇంక్ గా పేర్కొన్నారు. 12 మే తేదీన ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ వాలారు శ్రీకాంత్ పోలవరపు, శ్రీమతి సుధా కాట్రగడ్డ , బృహుత్ టెక్నాలజీస్ ఇంక్ కి కోర్ట్ సమ్మన్స్ పంపడం జరిగింది. 29 మే 2025 వ తేదీన ఆ సమ్మన్స్ వారికి అందినట్టు గా కూడా నిర్దారణ అయింది.
11 జూన్ 2025 వ తేదీన బృహత్ టెక్నాలజీస్ ఇంక్ నుంచి, శ్రీకాంత్ పోలవరపు, శ్రీమతి సుధా కాట్రగడ్డ దగ్గర నుంచి సమాధానం తిరిగి ఫైల్ చేయడం జరిగింది.
అప్పటి నుంచి కోర్టు రెండు వైపులా పార్టీలతో, వారి వారి లాయర్లతో అనేక సార్లు అనేక రకాల ఇన్ఫర్మేషన్ అడగటం కోర్ట్ హియరింగ్ కి రెండు వైపులా న్యాయవాదులు వచ్చి, వారి వారి వాదనలు వినిపించి కోర్టు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతోంది.
అమెరికాలో లీగల్ కేసుల ప్రొసీజర్ లో భాగంగా కోర్టు ఒక జడ్జి ని అపాయింట్ చేసి రెండు పార్టీలను దగ్గరికి పిలిచి మాట్లాడి కేసును క్లోజ్ చేసే అవకాశం ఉండేలా Adjudication – Arbitration చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ కేసులో కూడా ఒక నెల రోజుల క్రితం Arbitration చేయవలసిందిగా కోర్టు నిర్ణయించింది. 26 మే 2026 న కోర్ట్ ఇరు వర్గాలను సమావేశ పరిచింది అని కూడా తెలిసింది.
అప్పుడు శ్రీకాంత్ పోలవరపు వర్గం నుంచి ఒక ప్రపజల్ ఇచ్చింది.. దాని సారాంశం ఏమిటంటే తాము వెంటనే $350,000 పేమెంట్ చేస్తామని , ఆ తర్వాత నెలకు $ 50000 పేమెంట్ చేసుకుంటూ మొత్తం తీసుకున్న అమౌంట్ ని కట్టేందుకు సిద్ధంగా ఉనామాని తెలిపారు. అంతే కాకుండా ఈ కేసులో ముద్దాయిగా శ్రీమతి సుధా కాట్రగడ్డ పేరుని తీసివేయవలసిందిగా కోరారు.
అయితే ఈ రెండు పాయింట్ ని తానా బోర్డ్ ఒప్పుకోక పోవడం వల్ల కోర్టు నియమించిన జడ్జి తన ఆర్బిట్రేషన్ ముగించారు అని తెలిసింది.
అతి సున్నితమైన లీగల్ పాయింట్స్ ఇక్కడ రాయడం లో తెలుగు టైమ్స్ ముఖ్య ఉద్దేశం : తానా నాయకత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించే వాళ్ళకి , ఏం చేయట్లేదు అని తీర్మానించే వారికి , మధ్య లో రకరకాల అపోహలతో డౌట్ పడే సభ్యులకి సమాధానంగా ఇది కోర్టులో ఉన్న లీగల్ కేసు – ఇది ఈ విధంగా సాగుతోంది అని తెలుసుకోవాలని మా ఉద్దేశం అంతేకాకుండా తానా కార్యవర్గ సంఘంలో అభిప్రాయాలు ఉన్నా కూడా అందరూ ఏకాభిప్రాయంతో ఆ డబ్బు ఎలా వసూలు చేయాలి ?, నిందితులకు ఏ విధంగా శిక్ష పడాలి ? అన్న పాయింట్ మీదే పని చేస్తున్నారు. ఇది తప్పనిసరిగా అభినందించే విషయమే కదా !








