త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతా : విజయసాయి రెడ్డి
త్వరలో కొత్త రాజకీయ పార్టీ (Political party) స్థాపించనున్నట్టు మాజీ ఎంపీ విజయాసాయి రెడ్డి (Vijayasai Reddy) ప్రకటించారు. తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పక్షంగా ప్రజల కోసం, ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షింగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళిక (Political Plan) చెబుతానని వెల్లడించారు.








