ఒకప్పుడు బ్రిటీష్ వాళ్లు .. ఇప్పుడు కాంగ్రెస్ : బండి సంజయ్
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), ఖర్గే (Kharge) తీరుపై ప్రతి భారతీయుడు ఆశ్చర్యానికి లోనవుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ఆలపించకుండా అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. వందేమాతరం ఆలపించడాన్ని చూసి ఒకప్పుడు బ్రిటీష్ వాళ్లు భయపడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ (British) వాళ్లకు, కాంగ్రెస్ ( Congress) నాయకులకు మధ్య తేడా కనిపించడం లేదన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే వందేమాతరాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.








