ఇరాన్ తో వాణిజ్య సంబంధాలు కట్..యూఏఈ కీలక నిర్ణయం..!
పశ్చిమాసియా సంక్షోభం వేళ యూఏఈ కీలక నిర్ణయంతీసుకుంది. ఇరాన్ తో ఆన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను (All Trade- Financial Dealings) నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రకటించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ దేశంతో అన్ని వాణిజ్య, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలను నిలిపివేశామని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ వెల్లడించారు.
కొన్ని వారాలుగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్లను టెహ్రాన్ పదేపదే లక్ష్యం చేసుకుంటోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ (Iran) దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు యూఏఈలోని పలు ప్రాంతాల్లో దాదాపు 3,000 క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయి. మరిన్ని దాడులకు అవకాశం ఉండడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించింది. మరోవైపు అమెరికా తమ షరతులు అంగీకరించి, శాంతి ఒప్పందం కుదిరే వరకూ హర్మూజ్ జలసంధి మూసివేసే ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. దీని ప్రభావం యూఏఈ వాణిజ్యంపై కూడా పడనుంది.
వాస్తవానికి ఇరాన్ తో సంధికి ఓ ప్రయత్నం చేసింది యూఏఈ. తమ దేశాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా ఉన్న ఇరాన్ దాడులను నిలిపివేసేందుకు అన్నిప్రయత్నాలు చేసింది. దీనిలో భాగంగా రెండు టన్నుల బంగారం , యూఏఈ ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులు, డబ్బులను విడుదల చేసింది కూడా. దీనికి సంబంధించి యూఏఈ నుంచి .. ఇరాన్ కు కొన్ని షిప్స్ తిరిగాయి కూడా. కానీ ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలితం చూపకపోవడంతో.. యూఏఈ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.








