టీనేజ్ పిల్లల కోసం ChatGPTలో భారీ మార్పులు.. షాకింగ్ రూల్స్
సాయంత్రం 7 గంటలు.
టేబుల్‌పై స్కూల్ బుక్స్. పక్కనే హోంవర్క్ నోట్‌బుక్.
14 ఏళ్ల అబ్బాయి మాత్రం పుస్తకం తెరవలేదు. ఫోన్ తీసుకున్నాడు. ఒక ప్రశ్నను ఫోటో తీసి ChatGPTలో పెట్టాడు. కొన్ని సెకన్లు…అయ్యేసరికి పూర్తి సమాధానం స్క్రీన్‌పైకి వచ్చింది. అతను దాన్ని నోట్‌బుక్‌లో రాయడం మొదలుపెట్టాడు. పది నిమిషాల్లో హోంవర్క్ అయిపోయింది.
తల్లి కు డౌట్ వచ్చి “ఇంత త్వరగా అయిపోయిందా?” అని అడిగింది. అబ్బాయి నవ్వుతూ తల ఊపాడు. కానీ ఆ తల్లికి తెలియని విషయం ఒకటుంది. ఆ రోజు ఆమె కొడుకు హోంవర్క్ పూర్తి చేశాడు. కానీ ఆ పాఠం మాత్రం నేర్చుకోలేదు. ఇది ఒక్కరోజు సమస్య కాదు. ప్రతి మ్యాథ్స్ సమస్యకు AI సమాధానం ఇస్తే? ప్రతి ఎస్సేను AI రాసిపెడితే? ప్రతి డౌట్‌కు AI ముందే ఆలోచించి ఇస్తే?
కొంతకాలానికి పిల్లవాడు ఒక ప్రశ్నను చూసి… “దీనికి సమాధానం ఏంటి?” అని ఆలోచించడు. “ChatGPTని ఎలా అడగాలి?” అని ఆలోచిస్తాడు. ఇదే ఇప్పుడు తల్లిదండ్రుల అసలు ఆందోళన. భయం. AI పిల్లల చదువును సులభం చేస్తోందా? లేక…పిల్లలు ఆలోచించే అవసరాన్నే తీసేస్తుందా? మెదడులను మొద్దుబారేలా చేస్తోందా?
పరిష్కారం
ఈ సమస్యకు OpenAI ఇప్పుడు ఒక పరిష్కారం తీసుకొచ్చింది. 13 నుంచి 17 ఏళ్ల టీనేజర్ల కోసం ప్రత్యేకంగా ChatGPT for Teensను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇది కేవలం పిల్లల కోసం మరో ChatGPT వెర్షన్ కాదు. పిల్లలు AIని ఎలా ఉపయోగించాలి అన్నదానిపైనే కొత్త రూల్స్ పెట్టిన వెర్షన్.ఇది ఏం చేయబోతోంది.
ఇక హోంవర్క్‌కు నేరుగా ఆన్సర్ ఇవ్వదు. కొత్త Teen ChatGPTలో ప్రధాన మార్పు ఇదే. ఒక విద్యార్థి మ్యాథ్స్ సమస్య అడిగాడనుకుందాం. AI వెంటనే పూర్తి సమాధానం ఇచ్చి పని ముగించకుండా.. సమస్యను దశలవారీగా అర్థం చేసుకునేలా విద్యార్థిని గైడ్ చేస్తుంది. అంటే… “ఇదిగో నీ ఆన్సర్” అని చెప్పడం కంటే.. “ముందు నువ్వే ఆలోచించు” అని ప్రోత్సహిస్తుంది. కొత్త Study Mode కూడా ఇదే ఉద్దేశంతో పనిచేస్తుంది.
విద్యార్థి నిజంగా సమస్యను అర్థం చేసుకుంటున్నాడా? లేక AIతో మొత్తం అసైన్మెంట్ చేయించుకుంటున్నాడా? అన్నది గుర్తించేందుకు “responsible homework reminders” కూడా ఉంటాయి.
AI పిల్లల కోసం చదవకూడదు. పిల్లలతో కలిసి చదవాలి. AIతో గంటల తరబడి మాట్లాడకుండా… ఉండాలి. అలాగే సమస్య హోంవర్క్ దగ్గరే ఆగిపోలేదు. పిల్లలు ChatGPTతో ఎక్కువసేపు గడిపే అవకాశం కూడా పెరుగుతోంది. అందుకే Teen ChatGPTలో extended sessions సమయంలో మరింత తరచుగా break reminders వస్తాయి. ఎక్కువసేపు మాట్లాడితే కొంత విరామం తీసుకోమని సూచిస్తుంది. అంతేకాదు.. పిల్లలు తాము ఒక మనిషితో కాదు, AIతో మాట్లాడుతున్నామనే విషయం మర్చిపోకుండా కూడా గుర్తుచేస్తుంది. ఎందుకంటే AI ఎంత సహజంగా మాట్లాడినా… అది మనిషి కాదు.
AIని “ఫ్రెండ్”గా మార్చకుండా కొత్త రూల్
ఇది మరో ముఖ్యమైన మార్పు. టీన్ యూజర్లతో ChatGPT romantic language లేదా terms of endearment ఉపయోగించదు. తనకు feelings, consciousness లేదా emotions ఉన్నాయని కూడా పిల్లలకు బలంగా అనిపించకుండా మరింత కఠినమైన నియమాలు ఉంటాయి.
దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్. పిల్లవాడు AIని ఒక టెక్నాలజీగా ఉపయోగించాలి. తనకు అత్యంత దగ్గరైన వ్యక్తిగా భావించకూడదు. పిల్లలు దానిపై భావోద్వేగంగా ఎక్కువగా ఆధారపడే ప్రమాదాన్ని తగ్గించడంపై కూడా OpenAI దృష్టి పెట్టింది.
తల్లిదండ్రుల చేతిలో కూడా కంట్రోల్
ఇక తల్లిదండ్రులకు కూడా కొన్ని కొత్త నియంత్రణలు ఉంటాయి. వారు Study Hours సెట్ చేయవచ్చు. ఆ సమయంలో Study Mode డిఫాల్ట్‌గా పనిచేసేలా చేయవచ్చు. అలాగే Quiet Hours పెట్టి కొన్ని సమయాల్లో ChatGPTను పూర్తిగా బ్లాక్ చేయవచ్చు. అంటే పిల్లవాడి చేతిలో ఫోన్ ఉన్నా… AI ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అన్నదానిపై తల్లిదండ్రులకు కొంత నియంత్రణ ఉంటుంది.
ప్రమాదకరమైన చాటింగ్ కనిపిస్తే?
ఇది అత్యంత సున్నితమైన అంశం. Suicide, self-harm, eating disorders, violence వంటి ప్రమాదకరమైన విషయాలపై సంభాషణలను సిస్టమ్ గుర్తిస్తే safety notifications అందేలా చేస్తున్నారు. అంటే ప్రతి సాధారణ చాట్‌ను తల్లిదండ్రులు గమనిస్తారనే కాదు. కానీ ఒక టీనేజర్ సంభాషణలో తీవ్రమైన ప్రమాద సంకేతాలు కనిపిస్తే… అక్కడ AI ఒక్కటే నిర్ణయం తీసుకోకుండా పెద్దవాళ్ల సహాయం అవసరమయ్యేలా భద్రతా వ్యవస్థ పనిచేస్తుంది.
ఎందుకు ఇంత జాగ్రత్త?
ఇక్కడే ఈ మార్పుల వెనుక అసలు కథ ఉంది. OpenAI ప్రస్తుతం ChatGPTతో తమ పిల్లలకు హాని జరిగిందని ఆరోపిస్తున్న కొన్ని కుటుంబాల నుంచి వచ్చిన కేసులను కూడా ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో 13–17 ఏళ్ల టీనేజర్ల కోసం ప్రత్యేకమైన ChatGPTని తీసుకురావడం చాలా కీలకమైన మార్పు.
“ఈ మార్పులు ఎప్పటి నుంచి?”
ఆగస్టు 18, 2026 నుంచే. అంటే ఇది భవిష్యత్తులో రాబోయే ఫీచర్ కాదు. OpenAI ఇప్పటికే rollout ప్రారంభించింది. అయితే మీ పిల్లల ChatGPTలో ఈ మార్పులు కనిపించడానికి కొంత సమయం పట్టొచ్చు.








