మా హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి : మంత్రి లోకేష్
గత వైసీపీ హయాంలో ఫేక్ డేటాను తొలగించాం
శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి: ప్రజాప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయలేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 2022-23 ఏడాదిలో 7.6 శాతం తగ్గాయి. 2023-24 ఏడాదిలో 3.03శాతం తగ్గాయి. 2024-25లో 3.24 శాతం తగ్గాయి. ఇవి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలను నివారించాం. నకిలీ డేటాను తొలగించాం. దీంతో 2025-26లో 1.69 శాతం ప్రవేశాలు తగ్గాయి. 2026-27 ఏడాదికి వచ్చేసరికి 0.94శాతం ప్రవేశాలు పెరిగాయని మంత్రి చెప్పారు.








