మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను దళవాయి రమాదేవి కుటుంబసభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా, క్షేత్రస్థాయి కార్యకర్తగా తన సేవలను గుర్తించి, శాసనమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు మంత్రి నారా లోకేష్ కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే నిజమైన కార్యకర్తలను, నాయకులను గుర్తిస్తుందని, వారికి సముచిత స్థానం కల్పించడంలో ముందుంటుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆమెకు సూచించారు.








