ఆపిల్, అరటి, జామ, పపయా వంటి తాజా పండ్లను ముక్కలుగా చేసుకుని తినండి. ఫైబర్, పోషకాలు అందుతాయి.
ఫ్రూట్ బౌల్‌తో ఫ్రెష్‌గా
చక్కెర కలపని పెరుగులో తాజా పండ్లు, కొద్దిగా గింజలు కలిపితే రుచికరమైన, తృప్తినిచ్చే స్నాక్ సిద్ధం.
పెరుగు + పండ్లు.. సింపుల్ కాంబో
చిన్న మోతాదులో ఉప్పు లేని బాదం, వాల్‌నట్స్ లేదా ఇతర గింజలు తీసుకుంటే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి.
బాదం, వాల్‌నట్స్‌తో క్రంచీ స్నాక్
ఉడికించిన లేదా తక్కువ నూనెలో కాల్చిన శనగలకు నిమ్మరసం, ఉల్లిపాయ, కొత్తిమీర కలిపితే టేస్టీ సాయంత్రం స్నాక్ అవుతుంది.
ఉడికించిన శనగలు ట్రై చేయండి
కీరా, క్యారెట్, క్యాప్సికమ్ వంటి కూరగాయలను ముక్కలుగా కట్ చేసి హమ్మస్‌తో తినండి. ఫైబర్‌తో పాటు మంచి తృప్తి లభిస్తుంది.
కూరగాయలు + హమ్మస్
తక్కువ నూనె, ఉప్పుతో తయారు చేసిన మఖానా లేదా ఎయిర్-పాప్‌డ్ పాప్‌కార్న్‌ను తేలికైన స్నాక్‌గా ఎంచుకోవచ్చు.
మఖానా లేదా పాప్‌కార్న్
హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌పై పీనట్ లేదా ఆల్మండ్ బటర్ పలుచగా రాసుకుని తింటే ఫైబర్, ప్రోటీన్ కలిగిన స్నాక్ అవుతుంది.
హోల్‌గ్రెయిన్ టోస్ట్‌తో ఆకలి కంట్రోల్