ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (MLC)లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్సీ ( SC), బీసీ (BC)ల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. టీడీపీ పొటిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ( Varla Ramaiah), టీడీపీ నుంచి అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి (Dalavai Ramadevi) పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సంబంధిత దస్త్రాన్ని గవర్నర్ ఆమోదం కోసం లోక్‌భవన్‌కు పంపినట్లు సమాచారం.








