మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్టు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)ను పోలీసులు హౌస్ అరెస్టు (house arrest) చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి (TIMS Hospital) సందర్శనకు బయలుదేరిన హరీశ్‌రావును అనుమతి లేదంటూ కోకాపేటలో గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కోకాపేటలోని ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు.
సనత్‌నగర్ టిమ్స్ కూడా వెళ్లకుండా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)లను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్బంధాలు, హౌస్ అరెస్టులను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.








