ఆ పార్టీ నాయకులు నాపై దుష్ప్రచారం : ఎమ్మెత్యే పంతం నానాజీ
వైసీపీ (YCP) తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ (Pantam Nanaji) అన్నారు. తన మాటలను ఎడిట్ (Edit) చేసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, ఆ పార్టీ నాయకులు ఫేక్ నాయకులని దుయ్యబట్టారు. జగన్ (Jagan) అరాచక పాలనకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పాటైనట్లు చెప్పారు. కూటమి పాలన 15 ఏళ్ల పాటు ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. తమ మధ్య చిచ్చుపెట్టాలన్న వైసీపీ ప్రయత్నాలు ఫలించవని చెప్పారు.








