బ్యాగ్ సర్దుకోవడం, వస్తువులు సర్దుకోవడం, చిన్న పనులు చేయడం వంటి అలవాట్లు పిల్లల్లో బాధ్యత, స్వతంత్రతను పెంచుతాయి.
తమ పనులు తామే చేసుకోవడం
తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం, ఎదుటివారి మాటను శ్రద్ధగా వినడం పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చక్కగా మాట్లాడటం, వినడం
చిన్న సమస్య వచ్చిన ప్రతిసారీ పిల్లల తరఫున నిర్ణయం తీసుకోకుండా, పరిష్కారాలను ఆలోచించే అవకాశం ఇవ్వడం మంచిది.
సమస్యలకు పరిష్కారం వెతకడం
ఎంపికల వల్ల వచ్చే ఫలితాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నేర్పండి. వయసుకు తగ్గ చిన్న నిర్ణయాలు వారే తీసుకునేలా ప్రోత్సహించండి.
సరైన నిర్ణయాలు తీసుకోవడం
కోపం, బాధ, నిరాశ వంటి భావాలను గుర్తించి వాటిని ఆరోగ్యకరంగా వ్యక్తపరచడం నేర్చుకోవడం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.
భావోద్వేగాలను అర్థం చేసుకోవడం
ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడం పిల్లల్లో మంచి సంబంధాలు, టీమ్‌వర్క్‌కు పునాది వేస్తాయి.
ఇతరుల పట్ల గౌరవం, సానుభూతి
పిల్లలకు డబ్బు విలువ, పొదుపు, అవసరం-కోరిక మధ్య తేడా వంటి ప్రాథమిక ఆర్థిక విషయాలను వయసుకు తగ్గట్టు నేర్పండి.
డబ్బు విలువ, బాధ్యత తెలుసుకోవాలి
లైఫ్ స్కిల్స్‌ను కేవలం చెప్పడం కంటే రోజువారీ జీవితంలో పిల్లలు స్వయంగా ప్రయత్నించే అవకాశాలు ఇస్తే అవి మరింత బలంగా అలవాటవుతాయి.