“సమవర్తి” సినిమా నుంచి యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా “సమవర్తి” అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. “సమవర్తి” సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు హీరో సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ “సమవర్తి” సినిమా నుంచి మేకర్స్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చేతిలో కత్తితో ఇంటెన్స్ లుక్ లో సత్యదేవ్ కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఆయన చేతిలోని ఖడ్గంలో చిరుత పులి కనిపించడం, స్వర్గం కూడా మరణాన్ని కోరుతుంది అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది.
సౌతిండియాలోని 7 అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటిదాకా ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్ లో “సమవర్తి” సినిమా షూటింగ్ చేయడం విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన “సమవర్తి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి .
ప్రత్యేకంగా ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు.








