అలరించిన ఎస్ఎస్వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నృత్యార్చన
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం 150+ భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అన్నమయ్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం నాగోల్‌కు చెందిన ఎస్ఎస్వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు శ్రీమతి శ్రీవాణి అంబడపూడి గారి మార్గదర్శకత్వంలో శిష్యులు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వక నృత్యార్చన సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సిరి హాసిని, నాగ ప్రాప్తి పెండ్యాల, శ్రీవర్షిణి, ఆదిక మానస్వి, ఉత్తేజిత, బి. నక్షత్ర, టి. శాన్వి, మౌక్తిక, బి. నేహా శ్రీ, కె. షాడ్గుణ్య రెడ్డి, కె. అవిఘ్న రెడ్డి, టి. జాహ్నవి, గట్టు ఆకాంక్ష, వృంద, ముగ్ధ బారుణి, కె. లక్ష్మీ నిఖిల, కె. సహస్ర, అనన్య బోయిన్పల్లి, అనన్య శ్రీ లాస్య, ఎస్. తన్వి రెడ్డి, రోషనగారి శ్రీజ్ఞ, ఇందన జస్విత, శాలిని, ఇల్లందుల ప్రీతిక, హాసిని జవ్వాజీ, సూరి శ్రీలక్ష్మి, శ్రీమూర్తి హర్షిత, సి. సాయి నిహారిక తదితరులు సంయుక్తంగా “తాండవ నృత్యకారి, నారాయణతే నమో నమో, జయము జయము, చక్కని తల్లికి, చిదంబర కౌత్వం, బ్రహ్మ కడిగిన పాదము, గంధము పూయరుగా, తిరు తిరు, తందనానా, షోడశ కళానిధికి” అనే నృత్యాంశాలను భావ, లయ, అభినయ సమన్వయంతో అద్భుతంగా ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రతి నృత్య ప్రదర్శన భక్తి, శాస్త్రీయ నృత్య సౌందర్యం, అన్నమయ్య సాహిత్య మాధుర్యాన్ని ప్రతిబింబిస్తూ సభను మంత్రముగ్ధులను చేసింది.


ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమాచార్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గురువు శ్రీమతి శ్రీవాణి అంబడపూడి గారు తమ శిష్యులను భక్తి, భావం, లయ, అభినయ సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయమని అభినందించారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న కళాకారులందరికీ శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో భక్తి, నాట్య మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.








