శోభారాజు గారి సంకీర్తనలతో శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి మందిర ప్రతిష్ఠ
కొండాపూర్ లోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ సందర్భంగా అన్నమాచార్య భావన వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, డా. శోభా రాజు గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి యొక్క సంగీత సారధ్యంలో బహుళ ప్రచారం పొందిన అన్నమయ్య రచించిన రాములవారిపై, ఆంజనేయ స్వామి వారిపై సంకీర్తనలు, మరి కొన్ని శోభా రాజు గారు వారి స్వీయ రచన మరియు సంగీతం సమకూర్చిన పాటలను వారి శిష్యులు జయశ్రీ, వాసంతి, చైత్ర, రన్విత, శ్రేయ, తేజస్విని, మానస్, అభిరామ్, వైష్ణవి, గమ్య, దేవాంశి, పార్వతి సంయుక్తంగా భక్తి శ్రద్ధలతో ఆలపించారు. కీబోర్డ్ మీద రాజేశ్వరరావు, తబలా మీద అజయ్ వాయిద్య సహకారం అందించగా కార్యక్రమ అనుసంధానకర్త రమణ గోరింట్ల గారు వహించారు. కార్యక్రమానంతరం ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు శోభా రాజు గారిని వారి శిష్య బృందాన్ని సత్కరించారు.








