లెనిన్ కోసం శ్రీనివాస మంగాపురం వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ కృష్ణ(Krishna) ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ ఘట్టమనేని(Jaya krishna ghattamaneni) మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram) రిలీజ్ కు రెడీ అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు అజయ్ భూపతి(Ajay bhupathi) దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. మొదట ఈ సినిమాను జూలై 9న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, అదే సమయంలో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) లెనిన్(Lenin) రిలీజ్ ఉండటంతో బాక్సాఫీస్ పోటీని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ ప్లాన్‌ను మార్చారు మేకర్స్. తాజా ప్రచారం ప్రకారం ఈ సినిమాను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో బాలీవుడ్ నటి రషా తదానీ(Rasha Tadani) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. సంప్రదాయ దక్షిణాది యువతి లుక్‌తో పాటు యాక్షన్ సీన్స్, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తోనూ ఆమె ఆకట్టుకుంటున్నట్లు ప్రమోషనల్ వీడియోలు సూచిస్తున్నాయి. జయకృష్ణ- రషా జంట మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాపై పాజిటివ్ బజ్‌ను పెంచుతోంది. మరోవైపు కీలక పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారని సమాచారం. తిరుపతి- చిత్తూరు ప్రాంతీయ నేపథ్యాన్ని ప్రేమకథ, యాక్షన్ అంశాలతో మేళవిస్తూ అజయ్ భూపతి ఈ సినిమాను రూపొందించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రముఖ నిర్మాత అశ్విని దత్(Aswini Dutt) సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో ట్రైలర్‌తో పాటు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి సినిమాతోనే జయకృష్ణ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.








