జులై 12న TFAS వార్షిక పిక్నిక్ వేడుకలు
TFAS: న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి (TFAS) ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక పిక్నిక్ (Annual Picnic) కార్యక్రమం కోసం తేదీని ప్రకటించింది. ఈ వేడుక జులై 12, 2026, ఆదివారం రోజు ఘనంగా జరగనుంది.
వేదిక..
ఈ కార్యక్రమం ఎడిసన్ సీనియర్ సిటిజన్ సెంటర్ (2963 వుడ్బ్రిడ్జ్ అవెన్యూ, ఎడిసన్, ఎన్జే 08837) వేదికగా ఉదయం 10:00 గంటల నుంచి ప్రారంభం కానుంది. టీఎఫ్ఏఎస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (2026-2028) ఆధ్వర్యంలో జరగనున్న ఈ పిక్నిక్ కోసం ఆసక్తి గలవారు ముందుగానే తేదీని నోట్ చేసుకోవాలని (Save the Date) నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం www.tfasnj.org వెబ్సైట్ను సంప్రదించవచ్చు.








