ఆగస్టు 7, 8 తేదీలలో TCA ‘యూత్ ఇన్నోవేషన్ & లీడర్షిప్ ఫెస్టివల్
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను (TCA 50) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఆగస్టు 7 , 8, 2026 తేదీలలో రోసెన్బెర్గ్, టెక్సాస్లోని ‘ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్‘ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.
ఉద్దేశ్యం..
ఈ వేడుకల్లో భాగంగా, నేటి యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో “యూత్ ఇన్నోవేషన్ & లీడర్షిప్ ఫెస్టివల్”ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. యువతలో సృజనాత్మకతను పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం, బలమైన నెట్వర్కింగ్ను నిర్మించడం ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ చారిత్రాత్మక వేడుకలో భాగస్వాములై, స్ఫూర్తిని పొందాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం, రిజిస్ట్రేషన్ కోసం tca50.org వెబ్సైట్ను సందర్శించగలరు.








