TTA మెగా కన్వెన్షన్.. జూలై 17-19 వరకు ప్రత్యేక ‘రీల్స్ కాంటెస్ట్
TTA : అమెరికాలోని తెలుగు సమాజం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘TTA మెగా కన్వెన్షన్ 2026’ను పురస్కరించుకుని, నిర్వాహకులు కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక ప్రత్యేకమైన ‘రీల్స్ పోటీ’ని ప్రకటించారు. జులై 17 నుండి 19, 2026 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ మహాసభల విశిష్టతను చాటిచెప్పేలా క్రియేటర్లు వీడియోలు రూపొందించాలని కోరారు.
పోటీలో పాల్గొనే విధానం..
TTA కన్వెన్షన్ ఈవెంట్లను హైలైట్ చేస్తూ క్రియేటివ్ రీల్స్‌ను రూపొందించాలి.
పోస్ట్ చేసే సమయంలో @ttaconvention2026, @ttausa1, , @ttacharlotte అనే ఇన్స్టాగ్రామ్ పేజీలతో కొలాబరేట్ అవ్వాలి.
తప్పనిసరిగా #TTAMegaConvention2026 , #TTAConvention2026ReelsContest అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలి.
క్రియేటర్లకు ఉచిత జనరల్ అడ్మిషన్ పాస్..
5,000 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉండి, అర్హత కలిగిన రీల్స్ సమర్పించే క్రియేటర్లకు ఉచిత జనరల్ అడ్మిషన్ పాస్ లభిస్తుంది. మొదటి ముగ్గురు విజేతలకు ప్రత్యేకమైన TTA మెమెంటోలు, VIP యాక్సెస్ పాస్‌లు , సెలబ్రిటీలతో నేరుగా కలిసే అవకాశం కల్పించనున్నారు. ఈ పోటీకి ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ జులై 5, 2026. ఎంత త్వరగా రీల్స్ పోస్ట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ లభిస్తుందని, క్రియేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.








