15th June 2026

__________

- Saidulu

మగవారి ప్రోస్టేట్ సమస్యకు గుమ్మడికాయ గింజలు చేసే మేలు చూడండి...

వయసు పెరిగే కొద్దీ మగవారిలో ప్రోస్టేట్ సమస్యలు రావడం సహజం. దీనికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన పరిష్కారమే గుమ్మడికాయ గింజలు.

ప్రోస్టేట్ గ్రంథి సజావుగా పనిచేయడానికి జింక్ అవసరం. గుమ్మడి గింజల్లో ఈ జింక్ పోషకం అత్యధికంగా లభిస్తుంది.

జింక్ ఖజానా

ఇందులోని ఫైటోస్టెరాల్స్ ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగకుండా (BPH సమస్య) అడ్డుకుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

గ్రంథి వాపు నివారణ 

రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లడం, మూత్రం సరిగ్గా రాకపోవడం వంటి ఇబ్బందులను ఈ గింజలు సమర్థంగా తగ్గిస్తాయి.

మూత్ర సమస్యలకు చెక్

టెస్టోస్టెరాన్ హార్మోన్ బై-ప్రొడక్ట్ వల్ల ప్రోస్టేట్ పెరుగుతుంది. ఆ ప్రక్రియను గుమ్మడి గింజల్లోని మూలకాలు అడ్డుకుంటాయి.

హార్మోన్ల సమతుల్యత

ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ ప్రోస్టేట్ భాగంలో వచ్చే మంట, వాపులను తగ్గించడంలో తోడ్పడతాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు 

కేవలం ప్రోస్టేట్ మాత్రమే కాదు, పురుషులలో వీర్య కణాల నాణ్యతను, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి మేలు చేస్తాయి.

 వీర్యం నాణ్యత పెరుగుతుంది

రోజుకు ఒక చిన్న గుప్పెడు (15-30 గ్రాములు) పచ్చి గింజలు లేదా లైట్‌గా వేయించిన ఉప్పు లేని గింజలను తీసుకోవడం మంచిది.

ఎలా తీసుకోవాలి?

ఇందులోని మెగ్నీషియం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే రాత్రిపూట హాయిగా నిద్ర పట్టడానికి కూడా ఇది దోహదపడుతుంది.

ఇతర లాభాలు

గుమ్మడి గింజలు మంచి సప్లిమెంట్ మాత్రమే, కానీ మందులకు ప్రత్యామ్నాయం కాదు. తీవ్ర సమస్య ఉంటే డాక్టర్‌ను కలవాలి.