టీటీఏ మహాసభల్లో సందడి చేయనున్న దేవి శ్రీ ప్రసాద్.. జులై 18నే ‘ఎల్లమ్మ’ సినిమా సాంగ్ లాంచ్..
తెలంగాణ సంస్కృతిని, వైభవాన్ని అమెరికా వేదికగా చాటిచెప్పేందుకు ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం’ (Telangana American Telugu Association – TTA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘టీటీఏ మెగా కన్వెన్షన్ 2026’ మహాసభల వేదికపై టాలీవుడ్ సంగీత సంచలనం, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) తన లైవ్ పర్ఫార్మెన్స్తో అలరించబోతున్నారు. నార్త్ కరొలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు సాగనున్న ఈ మెగా కన్వెన్షన్ పోస్టర్‌ను నిర్వాహకులు అధికారికంగా విడుదల చేశారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు…
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌తో పాటు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఎల్లమ్మ’ (Yellamma) మూవీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సాంగ్ లాంచ్ , డీఎస్పీ లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ వేదికపైనే జరగనుంది.
కార్పొరేట్ భాగస్వాములు…
ఈ ప్రతిష్టాత్మక కన్వెన్షన్ విజయవంతం కోసం టీటీఏ సెంట్రల్ లీడర్షిప్ బృందం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహాసభల నిర్వహణను టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత తదితరులతోపాటు అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, టీటీఏ బోర్డు, ఆర్వీపీలు, కన్వెన్షన్ కమిటీల ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
అమెరికాలోని తెలుగు ప్రవాస కుటుంబాలంతా ఈ మ్యూజికల్ నైట్‌లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీటీఏ మేనేజ్మెంట్ కోరింది. ఈ మహాసభల రిజిస్ట్రేషన్ , మరిన్ని వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ ttaconvention.org ను సందర్శించవచ్చని లేదా టీటీఏ హెల్ప్‌లైన్ 1-866-TTA-SEVA ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.








