జూన్ 27న హ్యూస్టన్ ఐడల్ పోటీలు
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకల (50 Years Golden Jubilee Celebrations) పురస్కరించుకుని ప్రవాస తెలుగువారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ‘హ్యూస్టన్ ఐడల్’ (Houston Idol) పేరిట ఒక భారీ టాలెంట్ కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. “సింగ్.. డాన్స్.. షైన్” అనే నినాదంతో సింగింగ్, డాన్స్ రంగాల్లో ప్రతిభ గలవారి కోసం ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేసింది.
తేదీ , సమయం..
ఈ ‘హ్యూస్టన్ ఐడల్’ పోటీలు జూన్ 27వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఫుల్షీర్లోని ‘ఐరిన్ స్టెర్న్ కమ్యూనిటీ సెంటర్’ (Irene Stern Community Center, 6920 Fulshear Katy Rd, Fulshear, TX 77441) లో జరగనున్నాయి.
పోటీల వివరాలు..
ఈ ఈవెంట్లో సోలో సింగింగ్ (Solo Singing), సోలో డాన్స్ (Solo Dance), గ్రూప్ డాన్స్ (Group Dance – కనిష్టంగా 2, గరిష్టంగా 10 మంది) విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వయస్సు ఆధారంగా మూడు వర్గాలుగా ఈ పోటీలు ఉంటాయి.
- సబ్ జూనియర్: 8 నుండి 13 సంవత్సరాలు
- జూనియర్: 14 నుండి 19 సంవత్సరాలు
- సీనియర్: 20 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ప్రతి పార్టిసిపెంట్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు $30 గా నిర్ణయించారు. నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 15, 2026. ఆసక్తి గలవారు వెబ్సైట్ లేదా ఫ్లయ్యర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆగస్టు 8, 2026న ఫోర్ట్ బెండ్ ఎపికెంట్లో జరిగే టీసీఏ 50వ స్వర్ణోత్సవ ప్రధాన వేడుకల్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సువర్ణావకాశం లభిస్తుంచనుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీసీఏ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కుడుముల, కన్వీనర్ జితేందర్ రెడ్డి, కల్చరల్ కమిటీ చైర్స్ స్నేహ లత చిర్ర, శాంత సురేష్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులు పిలుపునిచ్చారు.
సంప్రదించాల్సింది..
మరిన్ని వివరాల కోసం స్నేహ (312-972-4232), ఆశ జ్యోతి (314-809-8957) లని సంప్రదించవచ్చు లేదా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.








